Revanth Reddy: విజయ సంకల్ప సభలో కేసీఆర్ పేరెత్తకుండా మోదీ ప్రసంగించడంపై రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy opines on Modi speech at Vijay Sankalp Sabha
  • ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాలు
  • సికింద్రాబాద్ లో విజయ సంకల్ప సభ
  • రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా మోదీ ప్రసంగం
  • కేసీఆర్ అధిష్ఠానం మోదీయేనన్న రేవంత్ రెడ్డి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ లో విజయ సంకల్ప సభ నిర్వహించడం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రాశస్త్యాన్ని, తాము చేసిన, చేయబోయే అభివృద్ధిని గురించి మాత్రమే మాట్లాడారు. ఇతర బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేసినా, తాను మాత్రం రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. 

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ మిత్రులారా... తన చీకటి మిత్రుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా కుటుంబపాలన, అవినీతి ఊసెత్తకుండా మోదీ గారి మిత్రధర్మం చూశారుగా...! అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అంటూ విమర్శించారు. కేసీఆర్ కు మోదీనే అధిష్ఠానం అని వ్యాఖ్యానించారు.
Revanth Reddy
Narendra Modi
KCR
Vijay Sankalp Sabha
Secunderabad
BJP
TRS
Telangana

More Telugu News