Bumrah: బ్రాడ్ పేరిట మరో చెత్త రికార్డు... చితకబాదిన బుమ్రా... వీడియో ఇదిగో!

Bumrah unleash his powers as Broad got unwanted record of most runs in a single over

  • బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • ధాటిగా ఆడిన బుమ్రా
  • ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకున్న బ్రాడ్
  • ఫోర్లు, సిక్సులు బాదిన బుమ్రా

ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో నాడు యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టడం భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరువలేరు. ఇవాళ బర్మింగ్ హామ్ టెస్టులో బ్రాడ్ కు మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. టీమిండియా కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ చేస్తుండగా బ్రాడ్ ఇన్నింగ్స్ 84వ ఓవర్లో బౌలింగ్ కు దిగాడు. అయితే, ఆ ఓవర్లో బ్రాడ్ కు ఏదీ కలిసి రాలేదు. ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే.

ఈ ఓవర్లో తొలి బంతికి బుమ్రా 4 కొట్టగా, రెండో బంతికి వైడ్, నాలుగు బైస్ తో కలిపి 5 రన్స్ లభించాయి. ఆ తర్వాత మూడో బంతిని బ్రాడ్ నోబాల్ వేయగా, బుమ్రా దాన్ని సిక్స్ గా మలిచాడు. బుమ్రా ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఇక చివరి బంతికి సింగిల్ రన్ తీయడంతో ఆ ఓవర్లో మొత్తంగా 35 పరుగులు లభించాయి. 

గతంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా, ఆస్ట్రేలియా ఆటగాడు బెయిలీ, సఫారీ ఆటగాడు కేశవ్ మహరాజ్ ల పేరిట ఉంది. లారా 2003లో దక్షిణాఫ్రికా బౌలర్ రాబిన్ పీటర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు సాధించాడు. బెయిలీ 2013లో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు సాధించాడు. కేశవ్ మహరాజ్ 2020లో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ బౌలింగ్ లో 28 పరుగులు నమోదు చేశాడు.

Bumrah
Broad
Most Runs
Single Over
  • Loading...

More Telugu News