Narendra Modi: డైనమిక్ సిటీలో ల్యాండ్ అయ్యాను: మోదీ

Landed in the dynamic city of Hyderabad tweets Modi
  • బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన మోదీ
  • హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని
  • పార్టీ బలోపేతం దిశగా సమావేశాల్లో చర్చిస్తామన్న మోదీ
ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో నేరుగా హెచ్ఐసీసీకి బయల్దేరారు. మరోవైపు హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యానని ట్వీట్ చేశారు. 

పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. ఇప్పటికే హెచ్ఐసీసీకి బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నారు. రేపు సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ భారీ బహిరంగసభ జరగనుంది.
Narendra Modi
BJP
Hyderabad

More Telugu News