2024లో గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తారు: కొడాలి నాని
- 2024లో గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానన్న యార్లగడ్డ
- 2019 ఎన్నికల్లో స్వల్ప మార్జిన్‌తో ఓడిపోయిన వైనం
- వంశీకే టికెట్ అంటూ కొడాలి నాని ప్రకటించడంపై డైలమా
2019 ఎన్నికలకు ముందు నుంచి గన్నవరం పార్టీ ఇంచార్జీగా దుట్టా రామచంద్రారావు వ్యవహరిస్తున్నారు. అయితే 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా ఎంట్రీ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ టికెట్‌ను దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయగా... యార్లగడ్డపై కేవలం 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఇటీవలే యార్లగడ్డ ప్రకటించారు. తాజాగా గన్నవరం నుంచి వంశీనే పోటీ చేస్తారంటూ నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.