"హిందువుల ప్రాణాలు కూడా విలువైనవే"... ప్లకార్డు ప్రదర్శించిన నటి ప్రణీత
- ఉదయ్ పూర్ లో టైలర్ దారుణ హత్య
- గొంతుకోసి చంపిన కిరాతకులు
- నుపుర్ శర్మకు మద్దతిచ్చాడంటూ ప్రతీకార హత్య
- దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు
తాజాగా, ఈ ఘటనపై ప్రముఖ హీరోయిన్ ప్రణీత స్పందించారు. హిందువుల ప్రాణాలు కూడా విలువైనవే అంటూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. "ఎవరైనా వింటున్నారా?" అంటూ తన ఫొటోకు ఆమె క్యాప్షన్ కూడా పెట్టారు. "ఉదయ్ పూర్ ఘటనకు చెందిన వీడియో చూడకూడదని అనుకున్నాను. కానీ అది చాలా భయానక ఘటన. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే అరుపులు మన మనసుల్లో ప్రతిధ్వనిస్తాయి, చాలాకాలం పాటు మనల్ని వెంటాడతాయి" అని పేర్కొన్నారు.