బాలకృష్ణ సినిమాలో ఫారిన్ ఫైట్ హైలైట్ అట!
- షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా
- మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ
- కథానాయికగా అలరించనున్న శ్రుతి హాసన్
- ప్రతినాయకుడిగా కనిపించనున్న దునియా విజయ్
గోపీచంద్ మలినేని ఇంతకుముందు చేసిన 'క్రాక్' సినిమా చూస్తేనే, ఆయన ఏ రేంజ్ లో ఫైట్స్ కంపోజ్ చేయిస్తాడనేది అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఫైట్స్ హైలైట్ అనేలా ఆయన చూస్తున్నాడట. ఫస్టాఫ్ లో వచ్చే ఫారిన్ ఫైట్ ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేసేలా ఉంటుందని అంటున్నారు.
అలాగే సెకండాఫ్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ఇంతకుముందు బాలకృష్ణ సినిమాల్లో చూడని విధంగా డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండటంతో, ఆ పాత్రల మధ్య వైవిధ్యం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక విలన్ గా దునియా విజయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.