ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు.. కారణమిదేనంటూ సీఎస్ ఉత్తర్వుల జారీ
- వరుసగా రెండో సారి ఏబీవీ సస్పెన్షన్
- ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతల స్వీకరణ
- ఏబీవీ క్రమశిక్షణారహితంగా వ్యవహరించారన్న ఏపీ సీఎస్
ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వెంకటేశ్వరరావు ఇటీవలే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే క్రమశిక్షణా రహితంగా వ్యవహరించడంతో పాటుగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను మరోమారు సస్పెండ్ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.