Telangana: రైతు బంధు నిధుల విడుద‌ల ప్రారంభం... తొలి రోజు 20 ల‌క్ష‌ల మంది రైతుల‌కు చేరిన సొమ్ము

ts government starts release of raitu bandhu funds
  • వానాకాలం పంట‌ల‌కు ఎక‌రాకు రూ.5 వేల చొప్పున విడుద‌ల‌
  • 68.10 లక్షల రైతులకు రూ. 7,521 కోట్లు విడుద‌ల చేయ‌నున్న ప్ర‌భుత్వం
  • తొలి రోజు రూ.586.66 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు హ‌రీశ్ రావు ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న రైతు బంధు నిధుల విడుద‌ల బుధ‌వారం ప్రారంభ‌మైంది. వానా కాలం పంట‌ల పెట్టుబ‌డి కోసం ఎక‌రాకు రూ.5 వేల చొప్పున విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిధుల విడుద‌ల‌కు ఇదివ‌ర‌కే ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వగా... బుధ‌వారం నుంచి నిధుల విడుదల ప్రారంభ‌మైంది. 

బుధ‌వారం ఒక ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ.586.66 కోట్లు జమ చేసిన‌ట్టు ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్ర‌క‌టించారు. ఈ విడత రైతు బంధులో భాగంగా మొత్తం 68.10 లక్షల రైతులకు రూ. 7,521 కోట్లు పెట్టుబడి సాయంగా అందించనున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. కేంద్రం అనేక ఆర్ధిక ఇబ్బందులు సృష్టిస్తున్నా అన్నదాతలకు ఏ లోటు రానివ్వద్దన్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న తెలిపారు.
Telangana
Raitu Bandhu
TRS
Harish Rao

More Telugu News