మైనార్టీలను జగన్ వాడుకుని మోసం చేశారు: బొండా ఉమ
- ముస్లింలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారు
- దుల్హన్ పథకాన్ని జగన్ కొనసాగించాలి
- మైనార్టీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించడం లేదు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల కోసం మైనార్టీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని... ఈ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు అనేక లోన్లు ఇప్పించి, వారి అభివృద్ధికి కృషి చేశారని బొండా ఉమ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మైనార్టీలను వాడుకుని వదిలేసిన ఘనత జగన్ దని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాదిరే మైనార్టీలను ఆదుకుంటామని చెప్పారు.