అంతమంది దేశాధినేతల్లో ప్రధాని మోదీ స్పెషల్.. జీ7 సదస్సు గ్రూప్ ఫొటో విడుదల చేసిన పీఐబీ
- మ్యూనిక్ లో జీ7, ఇతర దేశాధినేతలతో మోదీ గ్రూప్ ఫొటో
- సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న ప్రధాని
- ట్విట్టర్, కూ యాప్ లలో పోస్ట్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పలు సమస్యలు, పర్యావరణ, ఆర్థికపరమైన అంశాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో జీ7 సదస్సును చేపట్టారు. 26నే మ్యూనిక్ కు చేరుకున్న ప్రధాని మోదీకి జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షూల్జ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జర్మనీలో సదస్సుతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.