యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు... టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హాజరు
- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
- పార్లమెంటు భవన్లో నామినేషన్ దాఖలు
- రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేశ్ తదితరుల హాజరు
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఇక సిన్హాకు మద్దతు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.