తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
- రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఫిర్యాదు
- అర్హులకు కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కొత్త కార్డుల కోసం ఏకంగా 7 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. అర్హత ఉన్న పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అసలు 19 లక్షల రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేశారనే దానిపై విచారణ చేయాలని.. కొత్త రేషన్ కార్డులను ఎందుకు మంజూరు చేయడం లేదో దర్యాప్తు చేయాలని కోరారు.