Vaoshnav Tej: 'అంగరంగ వైభవంగా' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • గిరీశాయ నుంచి మరో ప్రేమకథా చిత్రం 
  • వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Angaranga Vaibhavanga Movie Update

తెలుగు తెరపై ఎప్పుడూ ప్రేమకథలదే హవా. సరైన కంటెంట్ ఉండాలేగానీ, యూత్ బ్రహ్మరథం పడుతుంది. అలా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రేమకథా చిత్రాలలో ఒకటిగా 'అంగరంగ వైభవంగా' కనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 

వైష్ణవ్ తేజ్ కి ఇది మూడో సినిమా .. అలా కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమానే. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి. కేతిక శర్మ ఇంతకుముందు చేసిన రెండు సినిమాలూ పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా సక్సెస్ ఆమెకి కీలకంగా మారింది.

More Telugu News