హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'
- మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'
- తెలుగు రీమేక్ గా వచ్చిన 'భీమ్లా నాయక్'
- హిందీ రీమేక్ కోసం సన్నాహాలు
- జాన్ అబ్రహం హీరోగా సెట్స్ పైకి
- అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగు
మలయాళ మూలం దెబ్బతినకుండా త్రివిక్రమ్ ఆ కథలో చాలా మార్పులు చేశాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ - రానా నటించగా, ఇక్కడ కూడా విశేషమైన ఆదరణ పొందింది. ఒక బలమైన మల్టీ స్టారర్ సినిమాగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.
'అయ్యప్పనుమ్ కోషియుమ్' హిందీ రీమేక్ హక్కులు జాన్ అబ్రహం తీసుకున్నాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయన అనురాగ్ కశ్యప్ కి అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరో పాత్రను ఎవరు చేయనున్నారనేది త్వరలోనే తెలియనుంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు.