Vaishnavtej: వైష్ణవ్ తేజ్ సినిమాపై ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

  • సెట్స్ పైకి వెళ్లిన వైష్ణవ్ తేజ్ నాల్గో సినిమా 
  • దర్శకత్వం వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి 
  • కథానాయికగా నటిస్తున్న శ్రీలీల
  • గ్రామీణ నేపథ్యంలో దైవశక్తి ప్రధానంగా సాగే కథ  
Vaishnav Tej New Movie Update

'ఉప్పెన' సినిమాతో తొలి ప్రయత్నంలోనే వైష్ణవ్ తేజ్ యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత 'కొండ పొలం'లోను పాత్రకి తగినట్టుగా మెప్పించాడు. ఆయన నటించిన మూడో సినిమా 'అంగరంగ వైభవంగా' విడుదలకి సిద్ధంగా ఉంది. టైటిల్ ను బట్టే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేయవచ్చు. 

ఇక ఆ తరువాత సినిమాను కూడా ఆయన సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, నిన్ననే సాయితేజ్ క్లాప్ తో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. తాజాగా వదిలిన పోస్టర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో .. దైవశక్తి చుట్టూ అల్లుకున్న కథగా ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. 

దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఇంతకుముందు మంచు మనోజ్ తో 'అహం బ్రహ్మాస్మి' సినిమాను మొదలెట్టాడు. కొన్ని కారణాల వలన ఆదిలోనే అది ఆగిపోయింది. ఆ కథనే వైష్ణవ్ తో చేస్తున్నాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంపై శ్రీకాంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడనేది చూడాలి. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News