Akash Puri: 'చోర్ బజార్' నుంచి 'చోర్ కియారే' వీడియో సాంగ్!

  • ఆకాశ్ పూరి హీరోగా రూపొందిన 'చోర్ బజార్'
  • కథానాయికగా గెహనా సిప్పీ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి 
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
Chor Bazaar video song  released

ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్' సినిమా రూపొందింది. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన 'జార్జి రెడ్డి'  ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'చోర్ కియారే' అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది ఈ సినిమాలో ఐటమ్ నెంబర్. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలానే అనిపిస్తోంది. మంచి ఊపు .. ఉత్సాహం ఉన్న ఈ బీట్ ను సురేశ్ బాగానే కంపోజ్ చేశాడు. ఆకాశ్ స్టెప్పులు కూడా బాగున్నాయి. 

ఈ సినిమాలో ఆకాశ్ సరసన నాయికగా గెహనా సిప్పీ పరిచయమవుతోంది. ఇక గతంలో 'నిరీక్షణ' సినిమాతో కథానాయికగా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్చన, పాతికేళ్ల తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఒక డైమండ్ చుట్టూ తిరిగే ఈ కథ కామెడీని టచ్ చేస్తూ మాస్ యాక్షన్ తో నడస్తుందని జీవన్ రెడ్డి చెబుతున్నాడు.

More Telugu News