'కబాలి' డైరెక్టర్ తో రజనీకాంత్!
- వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీ
- త్వరలో సెట్స్ పైకి వెళతున్న 169వ సినిమా
- 170 వ సినిమాకి దర్శకుడిగా పా.రంజిత్
- లైన్లోనే ఉన్న లోకేశ్ కనగరాజ్
రజనీ 170వ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. పా.రంజిత్. గతంలో ఆయన రజనీతో 'కబాలి' .. ' కాలా' అనే రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాల వసూళ్ల సంగతి అటుంచితే, రజనీని కొత్తగా .. మరింత స్టయిలీష్ గా చూపించడంలో రంజిత్ కి మంచి మార్కులు పడ్డాయి.
అందువల్లనే రీసెంట్ గా ఆయన వినిపించిన కథకి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఒక యువ దర్శకుడికి రజనీ ఇలా వరుస అవకాశాలు ఇవ్వడం విశేషం. ఇక లోకేశ్ కనగరాజ్ కూడా రజనీ కోసం ఒక కథను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్లిద్దరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.