తెలంగాణలో తాజాగా 434 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 292 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 129 మంది
  • ఇంకా 2,680 మందికి చికిత్స
తెలంగాణలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. గడచిన 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు నిర్వహించగా, 434 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 292 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 71, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,97,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,90,347 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,680 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus
Update
New Cases

More Telugu News