Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న స‌ల్మాన్ ఖాన్‌

  • సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వ‌చ్చిన స‌ల్మాన్‌
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఓ మొక్క‌ను నాటిన వైనం
  • త‌న అభిమానులు కూడా ఇందులో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపు
bollywood hero salman khan participated in green india challenge in ramoji film city

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ బుధ‌వారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మొక్క‌ను ఆయ‌న నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మంలో దాదాపుగా అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వ‌చ్చిన స‌ల్మాన్‌... ఓ మొక్క‌ను నాటి ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామి అయ్యారు.

ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ఖాన్ త‌న అభిమానుల‌కు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునే దిశ‌గా పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేర‌కు తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నాన‌ని స‌ల్మాన్ పేర్కొన్నారు. గ్లోబ‌ల్ వార్మింగ్‌ను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో త‌న అభిమానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

More Telugu News