ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి!...ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స!
- ఫస్టియర్‌లో 54 శాతం మంది పాస్
- సెకండియర్‌లో పాస్ పర్సంటేజీ 65 శాతం
- ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- పరీక్షలు ముగిసిన 28 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించామన్న బొత్స
ఫస్టియర్ ఫలితాల్లో 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారన్న బొత్స... పాస్ పర్సంటేజీ 54 శాతంగా నమోదైందన్నారు. ఇందులో బాలురు 49 శాతం, బాలికలు 65 శాతం పాస్ అయ్యారని తెలిపారు. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా... 61 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన చెప్పారు. ఇందులో బాలురు 55 శాతం, బాలికలు 68 శాతం పాస్ అయ్యారన్నారు.
రెండేళ్లలో బాలికలే ఎక్కువశాతం పాస్ అయ్యారని మంత్రి చెప్పారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం 45 శాతం, రెండో ఏడాది 55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. అగస్టు 3వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.