రేపు సూర్య చేతుల మీదుగా రామ్ సినిమా సాంగు లాంచ్!
- మాస్ యాక్షన్ మూవీగా 'ది వారియర్'
- రామ్ జోడీగా అలరించనున్న కృతి శెట్టి
- సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీ
- జులై 14న తెలుగు .. తమిళ భాషల్లో సినిమా రిలీజ్
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతకుముందు వదిలిన 'బుల్లెట్' సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరో సాంగును రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు 'విజిల్' అనే సాంగ్ ను సూర్య చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు.
ఈ సాంగ్ డిజిటల్ రిలీజ్ కి హైదరాబాద్ - ఏఎంబీ సినిమాస్ వేదిక కానుంది. రేపు రాత్రి 7:12 నిమిషాలకు ఈ సాంగ్ ను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను జులై 14వ తేదీన విడుదల చేయనున్నారు.
.