ముఖానికి ముసుగుతో స్కూటర్ పై నర్సీపట్నం వెళ్లిన వంగలపూడి అనిత... వీడియో ఇదిగో!
- అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత
- నేడు ఛలో నర్సీపట్నం.. చింతకాయల విజయ్ దీక్ష
- పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లానన్న అనిత
దీనిపై ఆమె ట్వీట్ చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వారి వలయాలను ఛేదించుకుని ఛలో నర్సీపట్నం దీక్షాస్థలికి చేరుకున్నట్టు వెల్లడించారు. చింతకాయల విజయ్ దీక్ష విరమింపజేసినట్టు తెలిపారు. ఈ మేరకు వీడియో పంచుకున్నారు.
కాగా, ఈ ఉదయం ఓ మహిళా కానిస్టేబుల్ తన ఇంటి వద్ద కనిపించగా, నోటీసుల్లేకుండా తనను గృహ నిర్బంధం ఎలా చేస్తారంటూ అనిత ఆమెను తిప్పిపంపారు.