Vijay: హీరోగా విజయ్ తనయుడి ఎంట్రీపై కసరత్తు!

Vijay son entry in to the industry
  • తమిళనాట విజయ్ కి విపరీతమైన క్రేజ్ 
  • తన రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరో 
  • తనయుడి ఎంట్రీకి సన్నాహాలు మొదలెట్టిన విజయ్ 
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న జాసన్ 
తమిళనాట విజయ్ కి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అక్కడ మాస్ ఆడియన్స్ లో ఆయనకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ మధ్యకాలంలో తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. హీరోగా ఆయన తనయుడు జాసన్ ఎంట్రీ గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అయితే వచ్చే ఏడాదిలో జాసన్ ఎంట్రీ ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. తన తనయుడి కోసం విజయ్ కథలను వింటున్నట్టుగా సమాచారం. కొత్త దర్శకుల దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్స్ వరకూ విజయ్ కి కథలను వినిపించడానికి పోటీపడుతున్నారట.

యాక్టింగ్ వైపు రావాలని జాసన్ ను తాను ఒత్తిడి చేయలేదనీ, నటన వైపుకు రావాలనేది అతని ఆలోచన అని తాజా ఇంటర్వ్యూలో విజయ్ అన్నాడు. అతనికి ఇష్టమైన ఈ రంగంలో తన సపోర్టు ఎప్పటికీ ఉంటుందని విజయ్ చెప్పాడు. వచ్చే ఏడాది జాసన్ సెట్స్ పైకి వెళ్లడం మాత్రం పక్కానే అని తెలుస్తోంది. విజయ్ తదుపరి సినిమాలు వంశీ పైడిపల్లితోను .. లోకేశ్ తోను ఉన్న సంగతి తెలిసిందే.
Vijay
Jason
Kollywood

More Telugu News