Woman: పెళ్లయిన పది నెలల తర్వాత భర్త 'అతడు' కాదు 'అమె' అని గుర్తించిన భార్య

Woman found husband a woman ten months after their marriage
  • ఇండోనేషియాలో ఘటన
  • డేటింగ్ యాప్ ద్వారా పరిచయం
  • రహస్యంగా పెళ్లి చేసుకున్న జంట 
  • కట్నం కోసం వేధింపులు
  • అపై దిగ్భ్రాంతికర నిజం వెల్లడి
ఇండోనేషియాలో ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి పెళ్లయిన పది నెలల తర్వాత తన భర్త పురుషుడు కాదని, ఓ స్త్రీ అని గుర్తించి దిగ్భ్రాంతికి గురైంది. 22 ఏళ్ల ఆ యువతి తన 'భర్త'ను గతేడాది ఓ డేటింగ్ యాప్ లో పరిచయం చేసుకుంది. అవతలి వ్యక్తి తాను అమెరికాలో శిక్షణ పొందిన వైద్యుడ్ని అని, తనకు వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో నమ్మేసింది. 

కొంతకాలం ప్రేమాయణం నడిచిన పిమ్మట ఇరువురు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రభుత్వానికి సమర్పించాల్సిన పత్రాలు 'అతడి' వద్ద లేకపోవడంతో ఈవిధంగా రహస్యంగా ఒక్కటయ్యారు. కొత్త దంపతులు ఇద్దరూ దక్షిణ సుమత్రా ప్రాంతంలో కాపురం పెట్టారు. 

ఆ తర్వాత కొంతకాలానికి 'భర్త' తరచుగా కట్నం కోసం వేధించడం మొదలుపెట్టడంతో ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ క్రమంలోనే తన భర్త పురుషుడు కాదన్న దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. దాంతో ఆమె తన కుటుంబం వద్దకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల సలహాతో జాంబి జిల్లా కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది.
Woman
Husband
She
Indonesia

More Telugu News