Peddireddi Ramachandra Reddy: సొంత నిధులతో వకుళమాత ఆలయాన్ని నిర్మించిన మంత్రి పెద్దిరెడ్డి... ప్రారంభోత్సవానికి సీఎం జగన్ కు ఆహ్వానం

Minister Peddireddy invites CM Jagan to inaugurate Vakula Matha Temple
  • తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో వకుళమాత ఆలయం
  • పేరూరు బండపై కొలువుదీరిన అమ్మవారు
  • ఈ నెల 23న ప్రారంభోత్సవం
  • సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందించిన పెద్దిరెడ్డి 
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతికి సమీపంలో వకుళమాత ఆలయాన్ని నిర్మించారు. పేరూరు బండపై ఈ ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయ నిర్మాణం కోసం మంత్రి పెద్దిరెడ్డి సొంత నిధులు వెచ్చించారు. తిరుమల వెంకన్న ఆలయం, బెజవాడ దుర్గమ్మ ఆలయం తర్వాత బంగారు తాపడం చేసిన గర్భగుడిని కలిగివున్న ఆలయం ఇదొక్కటే. కాగా, ఈ ఆలయాన్ని ఈ నెల 23న ప్రారంభించనున్నారు. 

ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ ను మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి వేదమంత్రోచ్చారణ మధ్య ఆహ్వానపత్రిక అందజేశారు. టీటీడీ వేదపండితులు తిరుమల శ్రీవారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి సీఎంకు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 23న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయని సీఎంకు వివరించారు. ఈ నెల 18న అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. 

పేరూరు వకుళమాత క్షేత్రం ఇప్పటిది కాదు.  320 ఏళ్ల కిందట మైసూర్ పాలకుడు హైదర్ అలీ దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసమైంది. ఇక్కడి అమ్మవారి విగ్రహం కూడా మాయమైంది. అయితే, ఇన్నాళ్ల తర్వాత వకుళమాత ఆలయం మంత్రి పెద్దిరెడ్డి కారణంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఆయన వకుళమాత ఆలయాన్ని పునరుద్ధరించారు.
Peddireddi Ramachandra Reddy
Vakula Matha Temple
Inauguration
CM Jagan

More Telugu News