KTR: ఆ ఆరోపణలపై దృష్టి మరల్చేందుకేనా అగ్నిపథ్ తెచ్చింది?: కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్న

  • శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టు దక్కించుకున్న అదానీ గ్రూపు
  • అదానీకే ప్రాజెక్టు వచ్చేలా లంక ప్రభుత్వంపై మోదీ ఒత్తిడి తెచ్చారని ఆరోపణ
  • దీనిపై శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు
Was AgnipathScheme announcement just a ruse to divert Indias attention from Srilanka allegations on Modi questions KTR

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోదీ- ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని ట్విట్టర్లో ప్రశ్నించారు.  

 శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై మోదీ ఒత్తిడి తెర్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోదీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి.  

దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు.  

More Telugu News