నేడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా కాంగ్రెస్... కారణం ఇదే
- వేడుకలు వద్దని నాయకులు, కార్యకర్తలకు రాహుల్ సూచన
- అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో నిర్ణయం
- దేశ యువతకు అండగా నిలవాలని శ్రేణులకు ఆదేశం
రాహుల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వేడుకలకు దూరంగా ఉంది. అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని రాహుల్ గాంధీ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సందేశం పంపించారు. అగ్నిపథ్ పై దేశంలోని యువకులు ఎంతో వేదనకు గురవుతున్నారని, వీధుల్లో నిరసనలు చేస్తున్న వారికి కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు.
‘దేశంలో యువత వేదనలో ఉంది. ఈ సమయంలో మనం వారికి, వారి కుటుంబాలకు అండగా ఉండాలి. నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మనం యువత, వారి కుటుంబాల బాధలను పంచుకోవాలి. వారికి అండగా నిలబడాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.