హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన 'శశివదనే' చిత్రబృందం
- రక్షిత్ అట్లూరి హీరోగా 'శశివదనే' చిత్రం
- హీరోయిన్ గా కోమలీ ప్రసాద్
- సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం
- దసరాకు రానున్న 'శశివదనే'
ఈ రోజు చిత్ర హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డేను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ... గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’ చిత్రం అని వెల్లడించారు. ఇందులోని లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని తెలిపారు. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియర్‌గా, హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయని అన్నారు.
ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని, నటీ, నటులు సాంకేతిక నిపుణులు అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.