Junior NTR: ఎన్టీఆర్ చేసేది పూర్తి మాస్ మూవీనే!

  • ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాలతో 
  • చివరిదశకి చేరుకున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
  • త్వరలో సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు 
  • కథానాయిక విషయంలో రావలసిన క్లారిటీ  
Koratala movie update

ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావొచ్చాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

కొరటాల ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొత్త లుక్ తో డిఫరెంట్ గా చూపించనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. ఈ కథ ఎలా ఉండనుందనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. పాయింట్ ఏదైనా ఇది పూర్తి మాస్ కంటెంట్ తోనే రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. 

గతంలో ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' భారీ విజయాన్ని అందుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన కథానాయికల ఎంపిక విషయంలో కూడా క్లారిటీ రావలసి ఉంది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News