Nani: 'అంటే .. సుందరానికీ' అక్కడి వాతావరణం పడింది!

  • ఈ నెల 10వ తేదీన విడుదలైన 'అంటే సుందరానికీ'
  • తెలుగు రాష్ట్రాల్లో నిరాశపరిచిన ఫలితం  
  • యూఎస్ లో నిలకడగా ఉన్న వసూళ్లు 
  • 1మిలియన్ మార్కును క్రాస్ చేయనున్న సినిమా
Ante Sundaraniki movie update

నాని - నజ్రియా జంటగా రూపొందిన 'అంటే .. సుందరానికీ' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఇటు నాని .. అటు ఆత్రేయ ఇద్దరూ కూడా సక్సెస్ లతో ఉన్నారు. ఇక తమిళ .. మలయాళ భాషల్లో క్రేజ్ ఉన్న నజ్రియాను తీసుకుని వచ్చారు.

ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ తిరిగే కథ .. కావలసినంత కామెడీ. అందువలన ఈ సినిమా తప్పకుండా మంచి వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ నాని ఏదో సూత్రం చెప్పినప్పటికీ అది ఎవరికి ఎక్కలేదు. 

అయితే ఈ సినిమా యూఎస్ లో మాత్రం బాగానే ఆడుతోందట. వీకెండ్ తరువాత కూడా మంచి వసూళ్లతో నిలకడగా సాగుతోందని అంటున్నారు. నేడో రేపో అక్కడ ఈ సినిమా 1 మిలియన్ మార్కును క్రాస్ చేస్తుందని చెబుతున్నారు. ఇక్కడ బాగా ఆడిన 'శ్యామ్ సింగ రాయ్' యూఎస్ లో 1 మిలియన్ మార్కును టచ్ చేయలేదు. కానీ ఇక్కడ అంతంత మాత్రంగా ఉన్న 'అంటే .. సుందరానికీ' మాత్రం అక్కడ ఆ మార్క్ ను క్రాస్ చేయనుండటం విశేషమే.

More Telugu News