జులై 4న ఏపీకి ప్రధాని మోదీ రాక.. మంగళగిరి ఎయిమ్స్‌కు ప్రారంభోత్సవం
- మంగళగిరిలో నిర్మాణం పూర్తయిన ఎయిమ్స్
- జులై 4న మోదీ చేతుల మీదుగా ప్రారంభం
- మోదీ వెంట ఏపీకి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే
ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలోనే ఇటీవలే రాష్ట్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. అంతేకాకుండా ఆసుపత్రి నిర్మాణం మొత్తాన్ని ఆమె నిశితంగా పరిశీలించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే మోదీ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది.