APSCHE: ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ హేమ‌చంద్రారెడ్డి ప‌ద‌వీ కాలం పొడిగింపు

ANDHRA PRADESH STATE COUNCIL OF HIGHER EDUCATION chairman hemachandra reddy tenure extended
  • ఈ నెల 25తో ముగియ‌నున్న హేమ‌చంద్రారెడ్డి ప‌ద‌వీ కాలం
  • మూడేళ్ల పాటు ఆయ‌న ప‌ద‌వీ కాలం పొడిగింపు
  • 2025 జూన్ 26 వ‌ర‌కూ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్న హేమ‌చంద్రారెడ్డి
ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్న కె.హేమ‌చంద్రారెడ్డి ప‌దవీ కాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హేమ‌చంద్రారెడ్డి ప‌ద‌వీ కాలాన్ని ఏకంగా మూడేళ్ల పాటు పొడిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ పొడిగింపుతో 2025 జూన్ 26 వ‌ర‌కు ఆయ‌న ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్‌గా కొన‌సాగ‌నున్నారు. వాస్త‌వానికి ఈ నెల 25తో హేమ‌చంద్రారెడ్డి ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. అయితే ఈ గ‌డువుకు ముందే ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
APSCHE
ANDHRA PRADESH STATE COUNCIL OF HIGHER EDUCATION
Andhra Pradesh
YSRCP
KONIREDDY HEMACHANDRA REDDY

More Telugu News