జగన్‌కూ లేఖ రాసిన దీదీ... భేటీ ముగిశాక బయటకొచ్చిన ఆహ్వానం
- ఈ నెల 11ననే జగన్‌కు దీదీ లేఖ
- విపక్షాల భేటీకి హాజరుకావాలని వినతి
- భేటీ ముగిశాక లేఖను బయటపెట్టిన ఏఎన్ఐ
- తమకు దీదీ నుంచి ఆహ్వానమే అందలేదన్న సాయిరెడ్డి
అయితే దీదీ నుంచి జగన్‌కు ఆహ్వానం అందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పలు రాజకీయ పార్టీల నేతలతో బుధవారం ఢిల్లీలో దీదీ భేటీ ముగిశాక ఈ లేఖను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ బయటపెట్టింది. జగన్‌కు దీదీ రాసిన లేఖను విడుదల చేసిన ఆ వార్తా సంస్థ... ఈ భేటీకి వైసీపీ అధినేతను ఆహ్వానిస్తూ ఈ నెల 11ననే దీదీ లేఖ రాసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉంటే... విపక్షాలతో దీదీ భేటీపై బుధవారం ఉదయం స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బుధవారం వరకూ ఈ భేటీకి సంబంధించి తమకు దీదీ నుంచి లేఖ అందలేదని ఆయన ప్రకటించారు. భేటీ ముగిశాక ఈ లేఖ బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.