ఉపరాష్ట్రపతికి 3 నివేదికలు అందించిన విజయసాయిరెడ్డి... ఏపీకి ఓ కీలక ప్రతిపాదన చేసిన వైసీపీ ఎంపీ
- ఈ- కామర్స్ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా సాయిరెడ్డి
- ఆ హోదాలోనే వెంకయ్యతో సాయిరెడ్డి భేటీ
- ఈ- కామర్స్ సహా తేయాకు పరిశ్రమ, ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు అన్న అంశాలపై నివేదికలు
- ఏపీలో కొత్త జిల్లాలకూ వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రోడక్ట్ అనుమతించాలని సిఫారసు
దేశంలో ఈ- కామర్స్ రంగం వృద్ధి, డార్జిలింగ్‌లో తేయాకు పరిశ్రమ, ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు అంశాలపై సాయిరెడ్డి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ 3 నివేదికలను రూపొందించింది. ఆ నివేదికలనే ఆయన బుధవారం వెంకయ్యకు అందజేశారు. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చేందుకు అవసరమైన చర్యలను కూడా ఈ నివేదికల్లో కమిటీ పొందుపరచింది.
ఇదిలా ఉంటే... ఎగుమతి కేంద్రాలులుగా జిల్లాలను గుర్తించాలని ప్రతిపాదించిన ఈ కమిటీ... ఏపీని దృష్టిలో పెట్టుకునే చేసింది. ఈ విషయాన్ని వెంకయ్యతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా సాయిరెడ్డే స్వయంగా వెల్లడించారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రోడక్ట్ విధానాన్ని వర్తింపజేయాలని నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేశామని సాయిరెడ్డి వెల్లడించారు.