షావోమీ ఏసీ.. 30 సెకండ్లలోనే గది అంతా కూల్
- 60 సెకండ్లలో గదంతా వెచ్చగా..
- షావోమీ జెయింట్ పవర్ సేవింగ్ ప్రో
- చైనా మార్కెట్లో విడుదల
- ధర భారత కరెన్సీలో సుమారు రూ.29,000
ఈ ఏసీలో ఉన్న మరో మంచి ఫీచర్ విద్యుత్ ను చాలా వరకు ఆదా చేయడమే. అందుకే ఈ ఏసీకి ‘షావోమీ జెయింట్ పవర్ సేవింగ్ ప్రో’ అని పేరు పెట్టింది. చైనాలో ఈ ఏసీని 2,499 యువాన్ల ధరపై షావోమీ విడుదల చేసింది. భారత కరెన్సీలో రూ.29,000పైన. 3,500 వాట్స్ వరకు విద్యుత్ ను తీసుకుంటూ.. గదిని చల్లగా చేయగలదు. ఇది ఫుల్ డీసీ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్. హిటాచీ, ప్యానాసోనిక్ తో పనిచేసిన నిపుణుల సాయంతో షావోమీ ఈ ఏసీకి రూపకల్పన చేసింది. భారత్ సహా, ఇతర మార్కెట్లలో విడుదల చేసే విషయంపై షావోమీ స్పష్టత ఇవ్వలేదు.