కామినేని ఆసుపత్రిలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే
- షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన దీపిక
- ఉన్నట్టుండి హార్ట్ బీట్ పెరిగిన వైనం
- ఆందోళనతో కామినేని ఆసుపత్రికి వచ్చిన హీరోయిన్
- నోవాటెల్‌లో వైద్యుల పర్యవేక్షణలో దీపిక
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె తాను బస చేసిన నోవాటెల్ హోటల్‌కు వెళ్లిపోయారు. నోవాటెల్లోనూ ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దీపిక ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఆమెకు వైద్యులు సూచించినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.