Andhra Pradesh: ఏపీ సీఎం ప్ర‌ధాన స‌ల‌హాదారు అజేయ క‌ల్లం ప‌ద‌వీకాలం పొడిగింపు

  • జూన్ 3తో ముగిసిన అజేయ క‌ల్లం ప‌ద‌వీ కాలం
  • జూన్ 4 నుంచి ఏడాది కాలం పాటు ప‌ద‌వీ కాలం పొడిగింపు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
Ajeya Kallam gets an year extension as Principal Advisor to chief minister of andhra pradesh

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌ధాన స‌ల‌హాదారుగా ప‌నిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ క‌ల్లం ప‌ద‌వీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 3తో అజేయ కల్లం ప‌ద‌వీ కాలం ముగిసింది. అయితే ఈ నెల 4 నుంచి ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తున్న‌ట్లు సోమ‌వారం ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది.

2019లో అధికారంలోకి వచ్చాక.. విశ్రాంత ఐఏఎస్‌ అజేయ క‌ల్లంను ముఖ్యమంత్రి జ‌గ‌న్ త‌న ప్ర‌ధాన స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. ఈ ప‌ద‌వితో పాటు జ‌గ‌న‌న్న భూ హక్కు, భూర‌క్ష ప‌థ‌కం స్టీరింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గానూ అజేయ కల్లం వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

More Telugu News