తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
- రెండ్రోజుల్లో తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ
- రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
వాస్తవానికి ఈ నెల 8న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రుతుపవనాల గమనానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. జూన్ రెండో వారంలో కూడా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ఉండడం కూడా రుతుపవనాల ముందంజకు ప్రతిబంధకంగా మారాయని నిపుణులు విశ్లేషించారు.