స్మార్ట్ వాచ్ ల మార్కెట్లో తిరుగే లేని యాపిల్

This is the bestselling smartwatch in the world
  • బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ వాచ్ టాప్-5లో మూడు యాపిల్ వే
  • మొదటి స్థానంలో యాపిల్ వాచ్ సిరీస్ 7 
  • రెండో స్థానంలో యాపిల్ ఎస్ఈ వాచ్
  • ఐదో స్థానంలో యాపిల్ వాచ్ సిరీస్ 3
స్మార్ట్ వాచ్ ల ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ మార్కెట్లో యాపిల్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఐడీసీ అంచనాల అధ్యయనం ప్రకారం.. యాపిల్ వాచ్ సిరీస్ 7 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్ వాచ్. 2021లో ఇది విడుదలైంది. యాపిల్ ఫ్లాగ్ షిప్ వాచ్ ఇది. 

 ఇక ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ పొందుతున్న రెండో స్మార్ట్ వాచ్ కూడా యాపిల్ సంస్థదే. యాపిల్ వాచ్ ఎస్ఈ. యాపిల్ వాచ్ సిరీస్ 7తో పోలిస్తే ఇందులో కొన్ని ఫీచర్లు ఉండవు. అయినప్పటికీ ఇది కూడా ఎక్కువ మంది యూజర్లకు మంచి ఆప్షన్ గా మారింది. యాపిల్ వాచ్ ఎస్ఈలో ఈసీజీ ట్రాకింగ్, ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే వంటి ఫీచర్లు లేవు. 

ప్రపంచంలో టాప్ 5 స్మార్ట్ వాచ్ లలో మూడు యాపిల్ సంస్థవే కావడం గమనార్హం. స్మార్ట్ వాచ్ మార్కెట్ ను యాపిల్ శాసిస్తుందని చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం అక్కర్లేదు. 

 యాపిల్ 2017లో విడుదల చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 3 అత్యధికంగా అమ్ముడుపోతున్న ఐదో స్మార్ట్ వాచ్ గా ఐడీసీ జాబితాలో నిలిచింది. యాపిల్ వాచ్ సిరీస్ 3ని యాపిల్ నిలిపివేయకుండా కొనసాగిస్తూనే ఉంది. యాపిల్ నుంచి చౌక స్మార్ట్ వాచ్ ఇదే కావడం గమనార్హం. 

ఇందులో యాపిల్ వాచ్ సిరీస్ 7 ధర రూ.40 వేల నుంచి మొదలవుతుంటే.. యాపిల్ వాచ్ ఎస్ఈ ధర రూ.28,000గా ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 3 రూ.20 వేలల్లో లభిస్తోంది.
Go Back to Shorts
best selling
SMART WATCH
APPLE
Watch Series 7

More Telugu News