క్లాసెన్ వచ్చాడు... బాదాడు... రెండో టీ20లోనూ టీమిండియాకు తప్పని ఓటమి
- కటక్ లో మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 రన్స్
- 18.2 ఓవర్లలో ఛేదించిన సఫారీలు
- 46 బంతుల్లో 81 పరుగులు చేసిన క్లాసెన్
- సిరీస్ లో దక్షిణాఫ్రికాకు 2-0 ఆధిక్యం
అంతకుముందు కెప్టెన్ టెంబా బవుమా 35 పరుగులు చేయగా, చివర్లో డేవిడ్ మిల్లర్ 20 (నాటౌట్) పరుగులు చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, చహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జూన్ 14న విశాఖపట్నంలో జరగనుంది.