New Delhi: ఢిల్లీ కరోల్ భాగ్ లో భారీ అగ్ని ప్రమాదం

Huge fire at Delhis popular Karol Bagh market 39 fire engines douse flames
  • ఆదివారం తెల్లవారుజామున షూ మార్కెట్లో అగ్నికీలలు
  • ప్రమాద స్థలానికి 39 ఫైరింజన్లు 
  • మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
ఢిల్లీలో వరుస భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున కరోల్ భాగ్ ప్రాంతంలోని గఫర్ షూ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే 39 అగ్నిమాపక శకటాలను అధికారులు ప్రమాద స్థలానికి పంపించారు. ప్రమాద స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. 

‘‘కరోల్ భాగ్ గఫర్ షూ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదంపై మాకు ఉదయం 4.16 గంటలకు కాల్ వచ్చింది. దీంతో 39 అగ్నిమాపక శకటాలు అక్కడికి వెళ్లాయి’’ అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ప్రాథమిక సమాచారం. మార్కెట్ లోని మూడు లేన్లకు అగ్ని కీలలు వ్యాపించినట్టు అధికారులు చెప్పారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఎవరైనా గాయపడిందీ, లేనిదీ చెప్పగలమని ఓ అధికారి పేర్కొన్నారు. 

గురువారం సాయంత్రం ఢిల్లీలోని హమ్దీపూర్ లో క్రాకరీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. 27 అగ్నిమాపక శకటాలు ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశాయి. రెండు రోజులు తిరగకుండానే మరో ప్రమాదం నెలకొనడం గమనార్హం.
New Delhi
fire accident
Karol Bagh
gaffer market

More Telugu News