Pub: ఇంగ్లండ్ క్రికెటర్ కు చెందిన పబ్ లో అగ్నిప్రమాదం

Pub co owned by Stuart Broad caught in fire
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ కు చెందిన టాప్ అండ్ రన్ పబ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. స్టూవర్ట్ బ్రాడ్, మాజీ ఆటగాడు హ్యారీ గుర్నీతో కలిసి నాటింగ్ హామ్ షైర్ లో పబ్ నిర్వహిస్తున్నాడు. అప్పర్ బ్రాటన్ ప్రాంతంలో ఉన్న ఈ పబ్ లో వేకువ జామున మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే స్పందించి హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుంది. 

తీవ్రంగా శ్రమించి మంటలను చాలావరకు అదుపులోకి తెచ్చారు. అప్పటికే పబ్ పైకప్పు సహా భవనంలోని చాలా భాగం కాలిపోయింది. గణనీయమైన స్థాయిలోనే ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక దళ సిబ్బంది తెలిపారు. కాగా, బ్రాడ్ ప్రస్తుతం న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది.
Go Back to Shorts
Pub
Fire Accident
Stuart Broad
England

More Telugu News