నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు: టీటీడీ ప్రకటన
- నయనతార దంపతుల ఫొటోషూట్పై టీటీడీ సీరియస్
- మాఢ వీధుల్లో చెప్పులతో సంచరించడం దురదృష్టకరమన్న టీటీడీ
- సెక్షన్ల కింద కేసు నమోదుపై చర్చిస్తున్నామన్న టీటీడీ
ఈ వ్యవహారంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. శ్రీవారి ఆలయం సమీపంలోనే నయనతార దంపతుల ఫొటోషూట్పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కాళ్లకు చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది. వారిపై ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చన్న విషయంపై చర్చిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.