Vijayasai Reddy: అసభ్య పదజాలంతో దూషించడం నారా లోకేశ్ కు అలవాటే: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy fires on Nara Lokesh
  • కుసంస్కారంతో టీడీపీ వ్యవహరిస్తోందన్న విజయసాయి 
  • జూమ్ మీటింగ్ కు 'కంసమామ జగన్' అని పేరు పెట్టారని విమర్శ 
  • నిన్న జరిగింది కేవలం ఆరంభం మాత్రమేనని కామెంట్ 
వైసీపీ వాళ్లను అసభ్య పదజాలంతో దూషించడం టీడీపీ నేత నారా లోకేశ్ కు అలవాటేనని... అది ఆయనకు పుట్టుకతో వచ్చిన సమస్య అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. చాలా కుసంస్కారంతో టీడీపీ వ్యవహరిస్తోందని అన్నారు. 

నిన్న లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ కు 'కంసమామ జగన్' అని పేరు పెట్టారని మండిపడ్డారు. ఇంత జుగుప్సాకరమైన పనులు చేస్తున్నారు కాబట్టే... ప్రశ్నించడానికి జూమ్ మీటింగ్ లోకి మావాళ్లు వెళ్లారని చెప్పారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ బుద్ధి మార్చుకోకపోతే తాము తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు.  

నిన్న జరిగింది కేవలం ఆరంభం మాత్రమేనని... రాబోయే రోజుల్లో తరింత తీవ్రంగా ఎదురుదాడి చేస్తామని చెప్పారు. పదో తరగతిలో విద్యార్థులు ఎందుకు ఫెయిలయ్యారో తెలుసుకోవాలి కానీ.. ముఖ్యమంత్రి జగన్ ను తిట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చర్చకు రావాలని లోకేశ్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని... చర్చకు రావాలని ఆయనను కోరుతున్నానని చెప్పారు. చర్చకు చంద్రబాబు వచ్చినా తాము సిద్ధమేనని అన్నారు.

More Telugu News

Vijayasai Reddy
Jagan
YSRCP
Nara Lokesh
Telugudesam