బ్రిడ్జిపై వేళ్లాడుతూ... రైల్లోని ప్రయాణికుడి ఫోన్ కొట్టేసిన దొంగ... వీడియో వైరల్
- స్పైడర్ మ్యాన్ లా విన్యాసం చేసిన దొంగ
- బ్రిడ్జి కమ్మీలు పట్టుకుని వేళ్లాడిన వైనం
- కంపార్ట్ మెంట్ తలుపు వద్ద కూర్చున్న కుర్రాడు
- కుర్రాడి చేతిలో ఫోన్ ను లాగేసుకున్న దొంగ
బ్రిడ్జి కమ్మీలు పట్టుకుని వేళ్లాడుతున్న ఆ దొంగ... రైలు కంపార్ట్ మెంట్ తలుపు వద్ద కూర్చుని ఉన్న ఓ కుర్రాడి చేతిలో ఫోన్ ను లాగేసుకున్నాడు. అసలేం జరిగిందో కాసేపటికి అర్థం చేసుకున్న ఆ కుర్రాడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. బీహార్ లోని బేగుసరాయ్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.