Bihar girl: నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో బాలిక.. సోనూసూద్ సాయంతో శస్త్రచికిత్స

Sonu Sood helps little Bihar girl who was born with four legs four arms
  • కోలుకున్న బీహర్ బాలిక చౌముఖి కుమారి
  • నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జననం
  • తన ఖర్చుతో చికిత్స చేయించిన సోనూ సూద్
  • సూరత్ లోని ఆసుపత్రిలో చికిత్స విజయవంతం
బాలీవుడ్, టాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసే సామాజిక సేవ గురించి ఎక్కువ మందికి తెలుసు. ఆపన్నులను ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ వెనుకాడింది లేదు. తాజాగా ఆయన చేసిన సాయంతో ఓ బీహార్ బాలిక సాధారణ జీవితం గడిపేందుకు మార్గం ఏర్పడింది. 

బీహార్ కు చెందిన చౌముఖి కుమారి నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది. శస్త్రచికిత్స చేస్తే సాధారణంగానే జీవితాన్ని గడపొచ్చని వైద్యులు తేల్చారు. ఈ విషయం సోనూ సూద్ కు తెలిసింది. బాలికను సూరత్ లోని ఓ హాస్పిటల్ కు పంపించారు. అక్కడ బుధవారం ఏడు గంటల పాటు బాలికకు వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 

ఈ వివరాలను సోనూసూద్ స్వయంగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. శస్త్రచికిత్సకు ముందు, చికిత్స తర్వాత బాలిక ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో కూడా అందులో ఉంది.  తమ ప్రయాణం (తన, చౌముఖి కుమారి) విజయవంతమైనట్టు సోనూ సూద్ పోస్ట్ పెట్టారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలికను వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారు.
Bihar girl
four legs
four arms
surgery
sonu sood
helping

More Telugu News