Telangana: ఇవాళ సాయంత్రం మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

CM KCR To Meet Ministers This Evening
  • రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం
  • రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యూహంపైనా సమాలోచనలు
  • నిన్ననే షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనా విధానాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినందున.. దానిపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతును కూడగడుతున్న ఆయన.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న విషయం మీద మంత్రులతో సమాలోచనలు చేయనున్నారు. ఈ సమావేశం తర్వాత రాష్ట్రపతి ఎన్నికల మీద టీఆర్ఎస్ వైఖరి ఏంటన్నది తెలియనుంది.
Telangana
KCR
TRS
President Of India

More Telugu News