జంతువులకూ కరోనా వ్యాక్సిన్.. తొలి దేశీయ టీకా ఆవిష్కరణ
- అభివృద్ధి చేసిన హర్యానాకు చెందిన సంస్థ
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ
- జంతువుల్లో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లకు చెక్
శునకాలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్లను కరోనా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడం కంటే సొంతంగా అభివృద్ధి చేయడం నిజంగా పెద్ద విజయమని మంత్రి తోమర్ అన్నారు. అనోవ్యాక్స్‌తోపాటు సీఏఎన్-సీవోవీ-2 ఎలీసా (CAN-CoV-2 ELISA) కిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితంగా శునకాల్లో యాంటీబాడీలను గుర్తించొచ్చు.