YSRCP: వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డికి జైలులో ప్ర‌త్యేక వ‌స‌తుల‌కు నో చెప్పిన కోర్టు

  • వివేకా హ‌త్య కేసులో అరెస్టైన దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి
  • క‌డ‌ప సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు
  • జైలులో ప్ర‌త్యేక వ‌స‌తుల కోసం దేవిరెడ్డి పిటిష‌న్‌
  • పిటిష‌న్‌ను కొట్టేసిన క‌డ‌ప జిల్లా కోర్టు
kadapa  court dismisses ys viveka murder case accused devireddy petition

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌ను క‌డ‌ప జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. జైలులో త‌న‌కు ప్ర‌త్యేక వ‌స‌తుల‌కు అనుమ‌తివ్వాలంటూ దేవిరెడ్డి ఇటీవ‌లే పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన దేవిరెడ్డి ప్ర‌స్తుతం క‌డ‌ప సెంట్ర‌ల్ జైలులో జ్యూడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్నారు. 

ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ప‌లుమార్లు విచార‌ణ చేప‌ట్టిన క‌డ‌ప జిల్లా కోర్టు.. తాజాగా గురువారం కూడా విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా దేవిరెడ్డికి జైలులో ప్ర‌త్యేక వ‌స‌తులు అవ‌స‌రం లేద‌ని సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. సీబీఐ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన కోర్టు దేవిరెడ్డికి జైలులో ప్ర‌త్యేక వ‌స‌తుల‌కు నిరాక‌రిస్తూ ఈ పిటిష‌న్ కొట్టేసింది. 

More Telugu News