బాలయ్య సినిమా టైటిల్ ఇదేనంటూ రూమర్!

Balakrishna in Anil Ravipudi movie update
  • షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా 
  • ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మలినేని 
  • ఆ తరువాత ప్రాజెక్టు అనిల్ రావిపూడితో చేయనున్న బాలయ్య
  • టైటిల్ 'బ్రో ఐ డోంట్ కేర్' అంటూ టాక్  
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తారని అంతా వెయిట్ చేస్తున్నారు. 

అయితే ఈ సినిమా టైటిల్ కంటే .. ఆ తరువాత సినిమా అయిన అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వినిపిస్తుండటం విశేషం. 'ఎఫ్ 3' సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఆ తరువాత సినిమాను బాలయ్యతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ సినిమాకి 'బ్రో ఐడోంట్ కేర్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. అధికారికంగా రేపు ఈ టైటిల్ ను రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా సాగుతుందనీ, కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తుందని ముందుగానే చెప్పాడు. ఇక కథానాయికలుగా మెహ్రీన్ .. ప్రియమణి పేర్లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Balakrishna
Sreeleela
Mehreen
Priyamani

More Telugu News